జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విశాలాంధ్ర – విజయనగరం : వ్యవసాయ శాఖ, స్వయం సహాయ సంఘలద్వారా అంతర పంటల సాగుకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాన్ని అందించడం జురుగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు. ప్రపంచ చిరు ధాన్యాల సంవత్సరంగా ఈ ఏడాది ప్రకటించిన సందర్భంగా సోమవారం స్పందన ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ పంటల చిరుధాన్యాల ప్రదర్శన, ఆర్గానిక్ పధ్ధతి లో పండిరచిన పలు రకాల కూర గాయల ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ మూడో పంట క్రింద చిరు ధాన్యాల సాగు చేస్తున్నారని, రైతుకు ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. దేసీ రకాలకు మార్కెట్ లో చా గిరాకీ ఉందని రైతులు వాటి పై దృష్టి పెట్టాలన్నారు. అంతర్ పంటల సాగు వలన రెగ్యులర్ గా వేసే పంటకు ఎలాంటి నష్టం జరగకుండా అదనపు లాభం వస్తుందని అన్నారు. ప్రదర్శనలో బెల్లం, పసుపు, కారం పొడి, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, బ్రౌన్ రైస్, తో పాటు సన్న బియ్యం పలు వెరైటీ లను, కొర్రలు, సామలు, ఉలవలు, చోళు తదితర చిరు ధాన్యాలను ప్రదర్శించారు. ధరలు మార్కెట్ ధరల కన్నా తక్కువగా ఉండడం తో స్పందనకు విచ్చేసిన కక్షిదారులు , అధికారులు కొనుగోలు చేసారు. ఒక్క రోజే రైతులు సుమారు 17 వేల రూపాయల సరుకులు గంట లో విక్రయించారు.