జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం సహజ మరణాలనడం సిగ్గుచేటన్నారు. 26 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మద్యపాన నిషేధమంటూ సొంత బ్రాండ్లు తెచ్చారని ఆరోపించారు. నాటుసారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నేతలేనని చెప్పారు. తాను ప్రజాహితం కోసమే పనిచేస్తానని తెలిపారు. నాటుసారా దొంగలను పట్టించి కేసులు పెట్టేవరకు ఊరుకోనని హెచ్చరించారు. తమ పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున 26 కుటుంబాలకు సాయం చేయనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే దాకా ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.