Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

జ‌గ‌న‌న్న గోరుముద్ద‌లో.. రాగిజావ‌

చ‌దువుకునే పిల్ల‌ల‌కు శారీర‌క ఆరోగ్యం కోసం గోరుముద్ద ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం జ‌గ‌న్. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రాగి జావను అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. విద్యాదీవెనతో పాటు విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావను చేర్చినట్లు వివరించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాగి జావా అందిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ప్రపంచంతో పోటీపడి నెగ్గేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు జగన్ చెప్పారు. ఇందుకోసం అనేక పథకాలను, కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img