రాష్ట్రంలో రజక, నాయూ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ.285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద సాయం అందజేస్తున్నామని తెలిపారు. షాపులన్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40.81 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు.