జగన్ సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 23వ తేదీ వరకు జీవో నెం.1 ను సస్పెండ్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈనెల 20వతేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాల విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో నెం 1 ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.