Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జగన్‌పై విష ప్రచారానికే టీడీపీ పరిమితమైంది : సజ్జల

సీఎం జగన్‌పై విష ప్రచారానికే టీడీపీ పరిమితమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల మాట్లాడుతూ, రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ టీడీపీ ఏడుపు మొదలుపెట్టిందని, గత ప్రభుత్వం హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారనే సంగతి వారు తెలుసుకుంటే మంచిదని అన్నారు. గతంలో ఇసుక లేకుండానే నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కట్టాలో చంద్రబాబు చెప్పాలి. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు చెబుతున్న దాంట్లో వాస్తవమే లేదని సజ్జల తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img