Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

జగన్మోహన్‌ రెడ్డి పాలన ప్రజల్ని క్షోభలోకి నెట్టాయి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విశాలాంధ్ర బ్యూరో /నెల్లూరు : నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగిసిన అనంతరం శనివారం నెల్లూరు జిల్లాలోని నార్త్‌ రాజుపాలెంలోఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలోతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ2022 సంవత్సరానికి వీడ్కోలుపలుకుతున్నాం.
బాదుడు, విద్వేషాలు, విషాదాలు, విధ్వంసాల సంవత్సరంగా ఈఏడాది మిగిలిపోయింది.
ప్రతివ్యక్తీ శారీరకంగా,మానసికంగా,ఆర్థికంగా క్షోభ అనుభవించారు. ప్రభుత్వ పాలసీల కారణంగా అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయి. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రజల్ని క్షోభలోకి నెట్టాయి. అని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ ను సైకో అని ఏదో మాట కోసం అనడంలేదు. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతుంటే జగన్‌, అతని టీం ఆనంద పడుతున్నారు. మీడియాను కొట్టి ఆనందం పొందుతున్నాడు..సీఐడీ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నాడు అని అన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, కరెంట్‌ చార్జీలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. పెంచిన ధరలు, పన్నులతో ప్రజలపై పెనుభారం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మోపారు ఆయన ఆరోపించారు. దేశంలో రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.ఒక్కో రైతుపై సగటున రూ.2.42 లక్షల అప్పు ఉంది. ప్రతి రైతూ అప్పుల్లో ఉన్నాడు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం.. కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం ఉంద్ని అధికారికంగానే 1,673 మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మనిషి అనే వాడు కనీసం ఆలోచిస్తాడు.. కానీ ఈ సిఎం ఆలోచన కూడా చేయడం లేదు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఒక క్వింటా ధాన్యానికి 25 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. రేషన్‌ బియ్యం మొత్తం రీసైక్లింగ్‌ చేసి తరలిస్తున్నారు రేషన్‌ బియ్యం ఇచ్చిన వెంటనే కలెక్ట్‌ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో బియ్యం తరలింపు జరిగిందన్న విషయాన్ని పార్లమెంట్లో స్వయంగా కేంద్ర మంత్రి చెప్పార్ను రాష్ట్రంలో అన్ని చోట్లా గంజాయి, డ్రగ్స్‌ సరఫరా జరుగుతోంద్ని మద్యం రేట్లుపెరిగాయికాబట్టితాగలేక…మందుబాబులు గంజాయికి అలవాటు పడుతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి అతని టీం అని నాయుడు అన్నార్ను సీఎం ఎందుకు ఇంత తీవ్రమైన అంశంపై స్పందించడం లేదు.?మూడున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలపై 52 వేల దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయి నెల్లూరు లాంటి జిల్లాలో11మందిపైవివిధరకాలఅఘాయిత్యాలు జరిగాయి.ఒక పోలీసు 5 మంది ప్రాణాలు పోవడానికి కారణం అయితే ప్రజలు ఎందుకు ప్రశ్నించలేదు. ఇవి దారుణ పరిస్థితులు కాదామూడున్నరేళ్లలో 21 వేలమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. అందుకే ఆత్మహత్యలు పెరిగాయి. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అని అన్నారు.ఐటిలో మేటిగా నాడు నిలిచిన యువతనేడు నిస్సారంగా అయిపోయారు.
గోల్డెన్‌ క్వార్డలేటర్‌ కింద నాడు వాజ్‌ పేయిని ఒప్పించి ఈ ప్రాంతంలో హైవే రోడ్డువేయించాం. నేషనల్‌ హైవే నేడు ఎంత బాగుంది.మరి రాష్ట్ర రహదారుల పరిస్థితి ఏంటి? స్కూళ్లలో నాడు – నేడు అని పెయింట్‌ వేసిన ప్రభుత్వం..విద్యా ప్రమాణాల్లో రాష్ట్రాన్ని దేశంలో 19వ స్థానానికి దిగజార్చారు.స్కాలర్‌ షిప్‌ లు కొత్తగా వచ్చిన పథకమా.? కానీ జగన్‌ దాన్ని కూడా పథకం అని చెపుతున్నాడు.రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, మెడికల్‌ వ్యవస్థ మనుగడ సాధించే పరిస్థితి ఉందా? టాప్‌ 5 యునివర్సిటీలు అమరావతికి తీసుకువస్తే..కనీసం వాటికి రోడ్లు కూడా వెయ్యలేదు.రాష్ట్రంలో 2.70 లక్షల టిడ్కో ఇళ్లు కట్టాము. 90 శాతం పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా ఈముఖ్యమంత్రి ఆ ఇళ్లకు బూతు బంగ్లాలుగా మార్చేశారు.
వైసీపీలో ఎమ్మెల్యేలు నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారుఇప్పుడుకోట్లుకూడబెట్టారు.రాష్ట్రంలో ఎక్కడ లే అవుట్‌ వేసినా ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో సొంత ఆస్తి అమ్ముకోవాలి అంటే కూడా ఎమ్మెల్యేకు కమీషన్‌ ఇవ్వాలి.సిలికా శాండ్‌ అమ్మకాల్లో సొంతవర్గం వారిని కూడా జగన్‌ రెడ్డి బ్యాచ్‌ వదల్లేదు.మెడమీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్న సిఎం జగన్‌ రెడ్డి.దానికి కృష్ణపట్నం పోర్టు వ్యవహారమే ఉదాహరణ కందుకూరు ఘటనకు పోలీసు వైఫల్యం కారణం. అయితే దానికి కూడా ఈ ప్రభుత్వం నన్ను తప్పు పడుతుందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు
దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్న మైన ముఖ్యమంత్రి ఈ జగన్‌ రెడ్డి. జగన్‌ ఆస్తి రూ.370 కోట్లు. సీబీఐ చార్జిషీట్‌ లో వేసింది రూ.43 వేల కోట్లు.రాష్ట్రంలో జగన్‌ దగ్గర, అతని మనుషుల దగ్గర మాత్రమే డబ్బు ఉండా%ౌౌ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img