Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

జగన్‌ ఓర్వలేకపోతున్నారు

టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అడ్డంకులను దాటుకుని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గుర్రుగా ఉన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల నిరసన విజయవంతం కావడంతో జగన్‌ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అందుకే ఏపీ అంతటా విద్యుత్‌ కోతలు పెట్టారని ఆయన ఆరోపించారు. పోలీసులపై కూడా జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఉద్యోగులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ పోలీసులపై మండిపడ్డారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img