Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

జగన్‌, మోదీ కుట్రలకు ఏపీ ప్రజలు బలవుతున్నారు : శైలజానాథ్‌

ఏపీని మోసం చేసినందుకు మోదీ సర్కార్‌పై జగన్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌, ప్రధాని మోదీ కుట్రలకు ఏపీ ప్రజలు బలవుతున్నారని అన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్‌.. మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శైలజానాథ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img