Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

జగన్ లాంటి నాయకులు వస్తారని ఊహించే రాజ్యాంగంలో ఆ విధమైన ఏర్పాటు చేశారు: చంద్రబాబు

జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
ఆ జీవోను కొట్టివేసిన హైకోర్టు
న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు
అంతిమంగా గెలిచేది అంబేద్కర్ రాజ్యాంగమేనని వెల్లడి

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రజలను, విపక్షాలను, పౌర సంఘాలను ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దేశంలో అంతిమంగా గెలిచేది, నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమేనని ఉద్ఘాటించారు.

జగన్ వంటి నాయకులు వస్తారని నాడే ఊహించారని, అందుకే భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని, అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైందని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img