Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచి రెండు సెమిస్టర్‌లు.. అలాగే పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ సెమిస్టర్‌ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img