Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

జనసేన పేరు తీసి చంద్రసేనా అని పెట్టుకుంటే బెటర్‌..

మార్చి 28 ,29 తేదీల్లో జీ 20 విశాఖ వేదికగా సదస్సు నిర్వహిస్తున్నట్లు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. 45 దేశాలు, 250 మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న మాటలు రాజకీయ వ్యభిచారిలా ఉన్నాయని అన్నారు. ‘‘మనకెలాగా శీలం లేదు.. గంజాయి శీలవతి పేరు తెచ్చి పెట్టుకున్నట్లుంది. పవన్‌ కళ్యాణ్‌ ఉన్నవి నారావారి నరాలు, కమ్మని పసుపు రక్తం. జనసేన పేరు తీసి చంద్రసేనా అని పెట్టుకుంటే బాగుంటుంది. ఆంబోతు గమ్యం లేకుండా ఎలా పరిగెడుతుందో అలా ఉంది పవన్‌ స్పీచ్‌.. ఆంబోతు రంకెలు నీ నోటి నుండి వచ్చిన రంకెలు ఒకలాగే ఉంది అని అన్నారు. ‘‘సంక్రాంతి పండుగ ముందు వెళ్లి సంక్రాంతి మామూలు తీసుకొని వచ్చి మాట్లాడతావ్‌..ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన టీడీపీ గురించి ఎందుకు మాట్లాడలేదు..ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటూ తీవ్రస్థాయిలో పవన్‌పై మంత్రి అమర్నాథ్‌ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img