ఏపీ సీఎం జగన్‌తో ఇవాళ జరిగే చర్చలతో టాలీవుడ్ సమస్యలకు ఎండ్ కార్డు కాదని..శుభం కార్డు పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బేగంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ..చెప్పాలనుకున్నదంతా విపులంగా ముఖ్యమంత్రికి వివరిస్తామని చిరంజీవి చెప్పారు. భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తాం. సీఎంవో నుంచి నాకొక్కడికే ఆహ్వానం ఉందని తెలిసిందని తెలిపారు.అయితే ఇప్పటికే విజయవాడకి సినీ ప్రముఖుల బృందం బయల్దేరి వెళ్లింది. మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు విజయవాడకు వెళ్లారు. ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని విజయవాడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తానకు మాత్రమే ఆహ్వానం అందిందని చిరు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.