ఫ్యాప్టో నిరసనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) తీవ్రంగా నిరసించిన నేపథ్యంలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిసర్దుబాటు ప్రక్రియను ఫ్యాప్టో బహిష్కరించింది. ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి, కో
చైర్మన్లు చందోలు వెంకటేశ్వర్లు, కె.ప్రకాశ్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్.వెంకటేశ్వర్లు, కె.భాను మూర్తి తదితరులు తీవ్రంగా వ్యతిరేకిం చారు. దీనిపై విద్యాశాఖాధికారులు ఈనెల 9వ తేదీన ఆన్‌లైన్ సమావేశం నిర్వహించగా, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఫ్యాప్టో తీసుకున్న నిర్ణయానికి పీఆర్టీయూ, ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ, ఏపీ పీఈటీ, అండ్ ఎస్‌ఏ (పీడీ) మద్దతిచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఆ మేరకు భౌతికంగా సమావేశం నిర్వహించి ఉత్తర్వులు అమలు చేయాలని ఫ్యాప్టో సూచించింది. దీనికి ఏక పక్షంగా పనిసర్దుబాటు చేయా లంటూ విద్యాశాఖ ఆదేశాలి వ్వడాన్ని ఫ్యాప్టో తప్పుపట్టింది. ఆయా అంశాలపై గతంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, పాఠశాల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చలు నిర్వహించకుండా సర్దుబాటుకు ఉత్తర్వులు జారీచేయగా, దానిపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిరది. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన పనిసర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా పాఠశాల విద్యశాఖ వాయిదా వేసింది. సీనియార్టీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 15లోగా తెలియ జేయాలని ఆర్జీడీలు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది. ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిష్కరించాక, 16వ తేదీన తుది జాబితా విడుదల చేసి, 17న మండల స్థాయిలో పనిసర్దుబాటు చేయాలని ఆదేశించిందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.
డిమాండ్లు పరిష్కరించాకే సర్దుబాటు చేయండి: ఫ్యాప్టో
ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి… డిమాండ్లను పరిష్కరించాకే పని సర్దుబాటుపై నిర్ణయించాలని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ తెలిపారు. పని సర్దుబాటు ప్రక్రియలో భాగంగా అనేక అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జీవో 117, 128 ద్వారా కాకుండా, 2020లో విడుదల చేసిన జీవో 53 ప్రకారం పని సర్దుబాటు చేయాలని, ఈ సర్దుబాటులో సీనియర్లకు విల్లింగ్ అవకాశం కల్పించాలని, అనుభవాన్ని లెక్కించే సమయంలో ఫ్యానర్ నంబరు లేదా ర్యాంక్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. పని సర్దుబాటు ప్రక్రియను మండల, డివిజన్ స్థాయి వరకే పరిమితం చేయాలని, 70 శాతం పైబడిన వికలాంగ ఉపాధ్యాయులకు మినహాయిం చాలని, 6 నుంచి 10 తరగతు లుకు 10 సెక్షన్లు దాటిన సంద ర్భంలో 2 హిందీ, 2 ఫిజికల్ సైన్స్ పోస్టులను కేటాయించాలని, ప్రాథమిక్నోత పాఠశాలల్లో జీవో 60 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందు డిమాండ్లు పరిష్కరించాకే.. పనిసర్దుబాటుకు ముందుకెళ్లాలని పట్టుపట్టడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు ఫ్యాప్టో నేతలు తెలిపారు.