Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

టీటీడి హిందూ ధర్మ సలహాదారుగా చాగంటి నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ధర్మ ప్రచార కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నియమితులు కానున్నారు. తిరుపతిలోని పద్మావతి అతిధిగృహంలో శుక్రవారం సాయంత్రం చైర్మన్‌ వై వీ సుబ్బారెడ్డి, ఈ ఓ ధర్మారెడ్డి నేతృత్వంలో జరిగిన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సమీక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.ఇవి కాక హిందూ ధర్మ ప్రచారం కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో నిర్వహిండానికి ప్రణాళికలు రూపొందించాలని కూడా సమావేశం తీర్మానించింది. ఈ సమావేశం లో పాలకవర్గ సభ్యులు విశ్వనాథ్‌, మల్లీశ్వరి, రాములు, జె ఈ ఓ సదా భార్గవి, ఎస్విబీసి చైర్మన్‌ డాక్టర్‌ సాయికృష్ణ యాచేంద్ర, సీఈ ఒ షణ్ముఖ్‌ కుమార్‌, టీ టీ డి కి చెందిన వివిధ ప్రాజెక్ట్‌ల ప్రత్యేక అధికారి విజయ లక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img