తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడిరచారు. కరోనా నిర్థారణ కావడంతో హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ఆయన ఉండవల్లిలోని నివాసంలో హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.