Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

టీడీపీ చలో నర్సీపట్నం, ఎక్కడికక్కడ నేతల హౌస్‌ అరెస్టులు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతకు నిరసనగా టీడీపీ చలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావుతో సహా స్థానిక నేతలను గృహనిర్బంధం చేశారు. నర్సీపట్నంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వస్తున్న ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద గోడ కూల్చిన ప్రదేశాన్ని స్థానిక టీడీపీ, సీపీఐ నేతలు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img