టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. చింతమనేనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలకు నిరసనగా టీడీపీ ాబాదుడే బాదుడు్ణ పేరిట నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చింతమనేని ఘాటు వ్యాఖ్యలు చేశారంటూ చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చింతమనేనిపై చింతలపూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ చింతమనేని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ స్టే విధించింది.