Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌.. ఆయన భార్య హౌస్‌ అరెస్ట్‌

టీడీపీ నేత పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్‌లోనే ఉన్నారు. కాసేపట్లో టీడీపీ నేతల్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. కొల్లు రవీంద్రను చిల్లకల్లు వద్ద అరెస్ట్‌ చేసిన పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. మొత్తంగా గన్నవరం పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేశారు. దాడులు ప్రతి దాడులతో గన్నవరం అట్టుడుకింది. వంశీ అనుచరులు, టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి. నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. అలాగే పట్టాభి భార్య చందనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు చందన యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీసులు ఇంటికి తీసుకురావడంతో అమె ఇంట్లోనే నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img