Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

టీవీ ఛానల్‌ పెడుతున్నా: విజయసాయిరెడ్డి

రామోజీ ఉన్న రంగంలోకే ప్రవేశిస్తున్నానని వెల్లడి
ఎవరి ఛానల్‌ ఎలా పని చేస్తుందో చూసుకుందామని సవాల్‌

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీవీ ఛానల్‌ ను పెట్టబోతున్నానని విశాఖలో మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడిన ఆయన… రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్‌, టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని… ఏ మీడియా రంగంలో అయితే రామూ (రామోజీరావు) ఉన్నారో… అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నానని చెప్పారు. మీ ఛానల్‌ ఎలా పనిచేస్తుందో … తాను పెట్టబోయే ఛానల్‌ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ అంటూ సవాల్‌ విసిరారు. మీ రంగంలోకి తాను ఎంటర్‌ కాబోతున్నానని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img