Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

తన రాజీనామాపై మరోసారి స్పీకర్‌ కు లేఖ రాసిన గంటా

ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాసన సభ్యత్వానికి గంటా రాజీనామా చేశారు. అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడం పై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతోన్న నిర్వాసితుల, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధను కలిగించిందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని గంటా రాసుకోవచ్చాడు. దేశ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్‌, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా పోరాటం చేస్తానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img