Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

తారకరామ తీర్థ ప్రాజెక్ట్ ఎంతో కీలకం : మంత్రి బొత్స

  • విజయనగరం జిల్లాకు తారకరామ తీర్థ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. తోటపల్లి, తారకరామ తీర్థ సాగరం సాగునీటి ప్రాజెక్టుల పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూౌ ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి చినప్పల నాయుడు, కడుబండి శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ రఘురాజులతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జలవనరుల చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణకర్ రావు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img