Friday, June 9, 2023
Friday, June 9, 2023

తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్‌ షెడ్యూల్ వచ్చేసింది.. ఈ నాలుగు స్టేషన్‌లలోనే ఆగుతుంది

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైలు పట్టాలెక్కనుంది. ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నా.. ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. ఆ రోజు రైలు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి.. 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పట్టాలెక్కుతుంది. ఈ మేరకు అధికారికంగా టైం టేబుల్ విడుదల చేశారు.ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజూ తిరుగుతుందని రైల్వేశాఖ తెలిపింది. సికింద్రాబాద్‌-తిరుపతి (20701) వందేభారత్: సికింద్రాబాద్‌‌లో ఉదయం 6గంటలకు ప్రారంభమవుతుంది.. నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30కు చేరుకుటుంది. అంటే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. ఇక తిరుపతి-సికింద్రాబాద్‌(20702) రైలు.. తిరుపతిలో మధ్యాహ్నం 15.15లకు ప్రారంభమవుతుంది. నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45కు చేరుకుంటుంది. అయితే ఈ రైలు ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆగే స్టేషన్లు, టైమింగ్స్‌‌ను మాత్రమే వెల్లడించారు. వాస్తవానికి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.. వందేభారత్ రాకతో దాదాపు మూడు గంటల సమయం తగ్గనుంది.. అంటే 8.30 గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగానే ఉంటారు. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ రైళ్లను నడుపుతోంది. ఇక పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీ బాగా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వందేభారత్ రైలును ప్రయాణికులు బాగా ఆదరిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ రూట్‌లో రద్దీ అధికంగా ఉంటుంది.. అలాగే జర్నీ టైం కూడా తగ్గిపోనుంది. అందుకే వందే భారత్ రైలుకు మరింత ఆదరణ వస్తుందంటున్నారు.

ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు పరుగులు తీస్తోంది. ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలో విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ నుంచి వందే భారత్‌ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మొదలై.. విశాఖకు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైల్లో మొత్తం ఏసీ ఛైర్‌ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img