Monday, September 26, 2022
Monday, September 26, 2022

తిరుమలలో సీజేఐ ఎన్వీ రమణ

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఈ తెల్లవారు జామున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వారి వెంట ఉన్నారు. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆహ్వానం పలికారు. ఈ తెల్లవారు జామున సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img