వేంకటేశ్వర స్వామి వారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ఈనెల 24 నుంచి అదనంగా 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది.అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రేపు(బుధవారం)ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.