Monday, December 5, 2022
Monday, December 5, 2022

తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత చెబుతా : మంత్రి బొత్స

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా..లేదా అనేది చర్చించి చెబుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని, తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత అన్ని విషయాలు చెబుతానన్నారు. మూడు రాజధానులకు మేం కట్టుబడి ఉన్నామని అన్నారు. ‘‘అసెంబ్లీ, పార్లమెంట్‌ ఉన్నదే చట్టాలు చేయడానికి.. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మా ప్రభుత్వం విధానం మూడు రాజధానులు. మూడు రాజధానుల బిల్లులు పెడతాం. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మేం సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. టీడీపీ తన సామాజిక అభివృద్ధి కోసం ఆలోచిస్తోంది.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img