Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తెప్పోత్సవానికి ఏర్పాట్లూ పూర్తయ్యాయని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌పై మంగళవారం ఇంజినీరింగ్‌ అధికారులతో దేవస్థానం ఈఈ భాస్కర్‌ సమావేశమయ్యారు. ఇప్పటికే సిద్దమైన హంస వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెప్పోత్సవానికి ఈ నెల 14వ తేదీన ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తవ్వగా.. ఇంకా ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై ఇంజనీరింగ్‌ అధికారులు చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img