Friday, August 19, 2022
Friday, August 19, 2022

తెలుగు అకాడమీ కేసు.. వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం

తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిని ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన రూ. 92.94 కోట్ల పెండిరగ్‌ సొమ్మును వారంలోగా ఇవ్వాలని చెప్పింది. 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img