Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడిరచింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా, ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img