Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రుతుపవనాలు ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది. మరోవైపు కురుస్తున్న వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది.గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద నీటితో పలు కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img