Friday, March 31, 2023
Friday, March 31, 2023

తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి

. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు: సీఎం జగన్‌
. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల
. తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ

విశాలాంధ్ర`విజయవాడ/ తిరువూరు : విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అర్హత లేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని, ఎందుకీ తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి… పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద గత ఏడాది అక్టోబరు`డిసెంబరు 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.698.68 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
ఒక మనిషి పేదరికం నుంచి బయటపడటం ఒక్క చదువుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. సభలో మన కళ్లెదుటే కనిపిస్తున్న కలెక్టర్‌ ఢల్లీిరావుది అత్యంత సాధారణ కుటుంబమని, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇవాళ కలెక్టర్‌గా మీ కళ్లముందు కనిపిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యాసంవత్సరంలో ఫీజులు సమయానికి చెల్లించిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగిస్తారనే ఉద్దేశంతోనే ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు పూర్తిగా వాళ్ల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం అన్నారు. ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ తీసుకొచ్చామన్నారు. ఈ 45 నెలల పరిపాలనపై మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించి గతాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు.
దుష్టచతుష్టయంతో యుద్ధం
ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్‌ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? అని ప్రశ్నించారు. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉంటే అది మీ మీద మాత్రమే అన్నారు.
వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడనని తెలిపారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) ని నడిపిన ప్రతిపక్షంతో… డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) నడుపుతున్న మీ బిడ్డ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్‌ ఎవరో తెలుసా అని ప్రశ్నించారు. మీరందరూ ఆలోచన చేయాలని సీఎం జగన్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img