Monday, March 27, 2023
Monday, March 27, 2023

త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా.. కన్నా

పార్టీ పరిస్థితుల్లో ఇమడలేక బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తమ అనుచరులతో భేటీ తర్వాత రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సోము వీర్రాజు అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీ పరిస్థితులు సరిగా లేవన్నారు. పార్టీలో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మోడీ పట్ల జీవితాంతం అభిమానంతోనే ఉంటానన్నారు. సోము వీర్రాజు తీరు నచ్చకపోవడంతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img