Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

త్వరితగతిన సీమ ప్రాజెక్టులు

అవుకు : రాయలసీమ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం బన గానపల్లె నుంచి అవుకు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువ పనులకు సంబంధించిన లైనింగ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సొరంగ నిర్మాణా లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌ రెడ్డితో కలిసి ఫాల్ట్‌ జోన్‌ ప్రాం తాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ ప్రాంతానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా తరలించాల్సి ఉండగా వాటిలో భాగంగానే అవుకు వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిం చినట్టు తెలిపారు. ఒక టన్నెల్‌లో పది వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉన్న కాం ణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలి పారు. ఆగిన ప్రాంతం నుంచి పనులను వేగ వంతం చేసి టన్నెల్‌ పనులు పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించి నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్‌ నాటికి రాయలసీమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో జలాలను తరలిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మురళినాథ్‌ రెడ్డి, ఎస్సీ సురేష్‌ బాబు, మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాÛ డైరెక్టర్‌ సత్యనారాయణ రాజు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీహరి, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ పురంధరేశ్వరరావు, వైసీపీ నాయకులు కాటసాని తిరుపాల్‌ రెడ్డి, కర్ర హర్షవర్ధన్‌ రెడ్డి, ఎర్రబోతుల పాపిరెడ్డి, పోచ శీలా రెడ్డి, జయచంద్రారెడ్డి, బనగానపల్లి సీఐ సుబ్బరాయుడు, కర్నూల్లో ఎస్సై జగదీశ్వర రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img