Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ షాక్‌.. కీలక పదవుల్లో కోత.. ఇన్‌చార్జిగా తొలగింపు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కీలక పదవుల నుంచి తప్పిస్తూ ఆ పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒడిశా ఇన్‌చార్జి బాధ్యతల్లో కోతలు విధించిన బీజేపీ.. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో మార్పులు చేపట్టింది. అందులో భాగంగానే 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో పురందేశ్వరి స్థానంలో మోదీ, అమిత్‌ షాకి అత్యంత సన్నిహితుడైన ఓం ప్రకాశ్‌ మాథూర్‌ను ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ఛత్తీస్‌గఢ్‌ పర్యటన తర్వాత ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. రాజస్థాన్‌కు చెందిన ఓం మాథుర్‌ గతంలో గుజరాత్‌ ఇన్‌చార్జ్‌గా, గతేడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.పురందేశ్వరి అంచనాలకు తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయకపోవడమే ఈ మార్పులకు కారణమని చర్చ జరుగుతోంది.అదేవిధంగా, బీజేపీ పెద్దలు చెప్పినా కూడా ఆమె విస్తృత చేరికల కమిటీ సమావేశాన్ని నిర్వహించకపోవడంతోనే ఆమె బాధ్యతల్లో కోతలు విధించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img