Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

దస్తగిరి ఇంటికి సీబీఐ.. జాగ్రత్తగా ఉండాలని సూచన

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిని దస్తగిరి.. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ఇటీవల కడప జిల్లా ఎస్పీకీ ఫిర్యాదు చేశాడు. తనకు అదనపు రక్షణ కల్పించాలని కోరాడు. తనకు ఏమైనా జరిగితే ఎంపీ అవినాశ్ రెడ్డి, సీఎం జగనే బాధ్యులని చెప్పాడు.ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు ఈ రోజు వెళ్లారు. అతనికున్న భద్రత గురించి ఆరా తీశారు. ఏమైనా సమస్యలుంటే తమకు తెలియజేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని దస్తగిరికి సీబీఐ అధికారులు చెప్పారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img