Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాకాలం కావడంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో కొండకు కంచె వేసే పనులు వేగవంతమయ్యాయి. వచ్చేనెల దసరా ఉన్నందున ముందస్తుగా ఆలయ ఇంజనీరింగ్‌ విభాగం పనులను వేగవంతం చేస్తోంది. జియోటెక్నికల్‌ అధికారుల సూచనల మేరకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేటి నుండి మూడు రోజుల పాటు ఘాట్‌ రోడ్డును మూసివేయనున్నారు. దుర్గుగుడికి వచ్చే భక్తులు మహామండపం మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని అధికారుల సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img