ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 15వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిదిరోజులపాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. దుర్గమ్మను ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు.గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఉపశమనం పొందాలన్నారు. కరోనా నుంచి విముక్తి పొందాలని దుర్గమ్మను ప్రార్ధించినట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇందులో భాగంగానే.. రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు.