Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఏపీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌-బస్సుకు పేరు పెట్టు-నగదు బహుమతి పట్టు..

ఏపీఎస్‌ ఆర్టీసీ త్వరలోనే దూర ప్రాంత ప్రయాణికుల కోసం కొత్తగా నాన్‌ ఎసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెడుతోంది. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్‌, రీడిరగ్‌ ల్యాంప్‌ ఉంటాయి. ఈ బస్సులకు మంచి పేరు పెట్టాలని ఆర్టీసీ కోరుతోంది. బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేలా పేరు సూచించిన వారికి బహుమతి అందిస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 24 లోగా మంచి పేరు సూచించిన ఉద్యోగులకు అవార్డు, ప్రజలకు నగదు రివార్డు ఇస్తామన్నారు. మరెందుకాలస్యం.. మంచి పేరు ఆలోచించండి.. క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకోండి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img