Monday, August 15, 2022
Monday, August 15, 2022

దేశంలోనే అత్యంత అవినీతిపరుడు…అవినీతిని అరికడతాడంట..

సీఎం జగన్‌పై నారా లోకేష్‌ విమర్శలు
ముందు మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’
దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్‌ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యాప్‌కి 14400 నెంబర్‌ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదన్నారు. ‘‘అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్‌ ఇస్తున్న అవినీతి అనకొండ జగన్‌ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’ అని లోకేష్‌ సవాల్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img