Friday, June 9, 2023
Friday, June 9, 2023

దేశంలో రాజ్యాంగ విరుద్ధ పాలన

. రాహుల్‌పై అనర్హతకు నిరసనగా కాంగ్రెస్‌ దీక్ష
. సీపీఐ నేతల సంఫీుభావం
. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలపై దాడులు : గిడుగు రుద్రరాజు

విశాలాంధ్ర`విజయవాడ (వన్‌టౌన్‌): మోదీ ప్రభుత్వం ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్‌, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ గాంధేయ మార్గంలో శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టిందని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడు తున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ నిజాలను నిర్భయంగా మాట్లాడే నేత అని, మోదీ, అదానీ మధ్య అనుబంధాన్ని పార్లమెంటులో రాహుల్‌ ప్రస్తావించారన్నారు. రాహుల్‌ గాంధీ పై అనర్హత వేటు వేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలోనూ అనేక ప్రాజెక్టులను అదానీకి అప్పగించారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం కొనసాగిస్తామన్నారు.
బీజేపీ మతోన్మాదంతో దేశం విచ్ఛిన్నం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
దీక్షకు మద్దతు తెలిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మతోన్మాదంతో దేశం విచ్ఛిన్నంగా మారిందని ధ్వజమెత్తారు. రాహుల్‌ అనర్హత వేటు దేశంలోని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయమని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా మోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చివేసి, దుర్మార్గమైన, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తు న్నారని విమర్శించారు. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నిజ స్వరూపం దేశ ప్రజలకు అర్థమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో అంబానీ, అదానీ, కార్పొరేట్‌ సంస్థలకు తప్ప సామాన్య, పేద వారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. దేశంలో జాతీయ పార్టీ, లౌకిక పార్టీ కాంగ్రెస్‌ పార్టీనే అని ఏనాడో సీపీఐ చెప్పిందని స్పష్టం చేశారు. మోదీ అనుసరిస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లౌకిక, జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మోదీని చూస్తేనే భయమని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేతే అవినాష్‌ రెడ్డిని జైలుకు తరలించే పరిస్థితి ఏర్పడుతుందని జగన్‌ నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందిం చాలన్నారు. సీపీఐ అధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, దీనికి కాంగ్రెస్‌ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్‌కు దీక్షకు సీపీఐ హృదయపూర్వకంగా సంఫీుభావం తెలియజేస్తోందని అన్నారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్‌ గాంధీపై కుట్ర పూరితమైన పద్ధతిలో అనర్హత వేటు వేశారన్నారు. ఇది దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటి ఐక్యతకు తోడ్పడిరదన్నారు. దేశ ప్రజా స్వామ్యాన్ని మోదీ, అదానీ, అమిత్‌ షా చేతుల్లో బలికాకుండా కాపాడు కునేందుకు ప్రతిపక్షాలన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నా యని తెలిపారు. దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ పరిపాలన కొనసాగి స్తోందన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం మోదీ నిరంకుశ చర్య అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img