Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

దొంగ ఓట్లపై సీపీఐ నిఘా

ఎమ్మెల్సీ ఓటింగ్‌ సరళి పరిశీలించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాల వద్ద దొంగ ఓటర్లను రానివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రామకృష్ణ సహా పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, రామకృష్ణ, రమణ, నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, సీపీఐ నగర నాయకులు అల్లిపీర, బంగారు బాషా, వసంత్‌ తదితరులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్ర, పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలలు, కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆకుతోట పల్లి, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి, తాడిపత్రి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా అన్ని వర్గాల సమస్యలపై తమ వాణిని వినిపించే పీడీఎఫ్‌ అభ్యర్థులు కత్తి నరసింహా రెడ్డి, పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ఉపాధ్యా యుల సమస్యలపై గతంలోనే అనేక మార్లు శాసన మండలిలో ప్రజావాణిని వినిపించారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు బడుగు వర్గాల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యో గుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చి 2019 ఎన్నికల్లో ఓట్లు దండుకుని అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్‌కు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే కనీస జ్ఞానం లేకుండా పోయిందని ఘాటుగా వ్యాఖ్యా నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఎర చూపి ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను కలుషితం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మేధావులు రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా పీడీఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img