Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నందమూరి తారకరత్న హెల్త్‌ అప్డేట్‌.. మెరుగుపడుతున్న ఆరోగ్యం,

నందమూరి తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయలో కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ట్రీట్మెంట్‌ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది. తారకరత్న గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి వైద్యం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని.. అవసరమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నారాయణ హృదయాలయ తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్‌ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నారు.
మరోవైపు తారకరత్నను చూసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెంగళూరు వెళ్లారు. నారాయణ హృదయాలయ డాక్టర్లను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. గుండె పనితీరు పర్ఫెక్ట్‌గా ఉందని.. గుండెకు సంబంధించిన సమస్యలేవీ లేవని వైద్యులు తనకు వివరించారన్నారు. స్వెల్లింగ్‌ వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయన్నారు. తారకరత్నకు డాక్టర్లు అద్భుతంగా వైద్యం అందిస్తున్నారని.. దగ్గరుండి అన్నీ తానై చూసుకుంటున్న నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్న విజయసాయిరెడ్డి సతీమణి చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకే ఎంపీ తారకరత్నను చూసేందుకు వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img