Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. విజయనగర జిల్లాలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలులోని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రకాశంజిల్లా మార్కాపురంతోపాటు మరో ఏడు డిపోల్లో ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలోని పలు డిపోల్లో కార్మికులు ధర్నా చేపట్టారు.గుంటూరు కలెక్టరేట్‌లో ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ట్రెజరీ కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img