Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

నిరంతర విద్యుత్ అందిస్తాం.. మంత్రి పెద్దిరెడ్డి

  • విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో పోర్టల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంకా గ్రామ, వార్డు సచివాలయంలో కూడా విద్యుత్ కు సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఇక నుంచి సచివాలయంలో కూడా విద్యుత్ కి సంబంధించి ఫిర్యాదు చేయొచ్చన్నారు. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే ఈ ఏడాది 248, మిలియన్ యూనిట్లు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇదొక నిదర్శనమని తెలియజేశారు. అధికారులు శ్రమిస్తున్నారని, మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇంక ముందు 45 సేవలు అందిస్తున్నామన్నారు. తాజాగా మరో 12 సేవలు పొందుపరచడం జరిగిందన్నారు. సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం డీ సంతోష్ రావు, డైరెక్టర్లు, ఎస్ ఈ కృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img