Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

నిర్వాసితుల త్యాగఫలమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి

విశాలాంధ్ర – చింతూరు/వీఆర్‌ పురం/కూనవరం (అల్లూరి జిల్లా): నిర్వాసితుల త్యాగఫలమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అని సీపీిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం బైక్‌ ర్యాలీని చింతూరు ఐటీడీఏ ఆఫీస్‌ ముందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ నిర్వాసి తులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం నామ మాత్రమేననీ, పునరావాసం కోసం నిర్మాణం జరిపిన కాలనీలు గత ఏడాది వరదల్లో ముంపునకు గురయ్యా యన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసి తుల సమస్యలు పరిష్కారం కోసం 2007 నుంచి నేటి వరకు సీపీఐ పోరాడుతూనే ఉందన్నారు. అ పోరాటాల ఫలితం కొంత అందినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు. అందుకోసం జూన్‌ 26న పోలవరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు ఎటపాక మండలాల్లో ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు, రహదారుల దిగ్బంధనం, సభలు, సమావేశాలు, బైక్‌ ర్యాలీలు నిర్వహిసా ్తమన్నారు. దీనిలో భాగంగానే సోమవారం చింతూరు ఐటీడీఏ నుంచి వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించామన్నారు. పోలవరం నిర్మాణం వల్ల కూనవరం, ఎటపాక, విఆర్‌ పురం, చింతూరు, వేలేర్‌ పాడు, కుకునూరు, బూర్గంపాడు ఏడు మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు మండలాల్లో నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేసి దోబూచు లాడుతున్నారన్నారు. ముంపు పేరుతో 70% గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపివేశారని విమర్శించారు. బోయ ,వాల్మీకి ,బెంతు, ఒరియా, కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదివాసులకు నష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని చెప్పారు. ముంపు గ్రామాల్లో ఎకరానికి 10 లక్షల 50 వేలు పరిహారం ఇవ్వాలని, కాంటూరు తో సంబంధం లేకుండా ముంపు గ్రామాల అన్నిటికీ పరిహారం ఇవ్వాలని, మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందజేసి పునరావాసం కల్పించాలని కోరారు. నిర్వాసితుల కుటుంబాల్లో అర్హతను బట్టి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అల్లూరి సీతారామరాజు జిలా కార్యదర్శి పొట్టిగ సత్య నారాయణ, చింతూరు ఏరియా నాయకులు ఎస్కే రంజాన్‌, జంజరాల రాఘవులు, పోలవరం మండల నాయకులు, మండా దుర్గాప్రసాద్‌, గుజ్జ మోహన్‌రావు, కన్నారావు, ఎటపాక ఏరియా నాయకులు నాగరాజు, కంటే రాజు, బ్రహ్మం, వాసం రాము, పూసం రాఘవులు, బొల్లి వెంకన్న, ముక్కెర నరసింహ రావు, వెంకటేశు, వెంకన్న బాబు, విఆర్‌ పురం నాయకులు కర్నాటి ఏసు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img