Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

నెల్లూరులో ఘాతుకం..

ప్రేమించిన యువతిపై కాల్పులు..ఆపై తానూ కాల్చుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య


నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పులు కలకలం రేపాయి. తన ప్రేమకు అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించలేదనే కారణంతో యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్‌రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగరిత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరులో ఉండేవారు. ప్రస్తుతం వర్క్‌ ప్రమ్‌ హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కావ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. వారు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ తుపాకితో వెళ్లి కావ్యను కాల్చిచంపాడు. ఆ పై తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తం మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img