Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

నెల్లూరులో జనసేన విన్నూత్న నిరసన

రోడ్ల గుంతల చుట్టూ వైసీపీ రంగులతో కూడిన ముగ్గులేసి..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల పరిస్ధితి అధ్వాన్నంగా మారిందని ఆరోపిస్తూ జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. గుడ్‌ మార్నింగ్‌ సీఎం సర్‌ అంటూ నినాదాన్ని పెట్టి మరీ జనసేన క్యాడర్‌ నిరసన తెలుపుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం పాడైపోయిన రోడ్లపై స్పందించడం లేదు. దీంతో ఇవాళ నెల్లూరులో జనసేన కార్యకర్తలు విన్నూత్నంగా నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి హయాంలో రోడ్ల అధ్వానంగా తయారయ్యాయంటూ థాంక్యూ సీఎం సార్‌ అని నినాదంతో నగరంలోని గుంతలు పడ్డ రోడ్ల వద్ద వైసీపీ రంగులతో కూడిన ముగ్గులు వేసి తమ నిరసన చేపట్టారు. జనసేన రాష్ట్ర నాయకుడు కేతమ్‌ రెడ్డి వినోద్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి రోడ్లపై గతంలోనూ నిరసనలు తెలిపినా ఫలితం లేకపోవడంతో ఈ తరహా ఆందోళనలు చేపడుతున్నట్లు జనసేన నేతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img