Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

భయంతో పరుగులు తీసిన జనం
నెల్లూరుజిల్లాలో మరోసారి భూప్రకంపనలతో జనం భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ఉదయం నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతోపాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. పలు గ్రామాల్లో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత కాసేపటి తర్వాత మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img