Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

నెల్లూరు జిల్లాలో వరద ఉధృతి..హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌

అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లావ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి. జిల్లాలో వరద ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఉదయం గూడూరు`మనుబోలు మధ్య పంబలేరు వరద ప్రవాహంతో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు కిలోమీటరు వెళ్లాలంటే.. 4, 5 గంటల సమయం పడుతోంది. హైవేపై 10 కి.మీ. మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.నాయుడుపేటవద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. నెల్లూరు నుంచి గూడూరు వెళ్లేవారిని వెంకటగిరి బక్కలి రోడ్డులో వెళ్లాలని సూచించారు. అలాగే వెంకటగిరి వైపుకు కూడా వాహనాలను మళ్లించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img