గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు తీసుకొచ్చారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మంత్రి నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటారు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.